ఇవాళ అకౌంట్లలో డబ్బులు వేయనున్న జగన్..?
జగనన్న చేదోడు పథకం కింద రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 వేల చొప్పున జగన్ సర్కారు సాయం అందిస్తోంది. సీఎం జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఏపీ రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. జగన్ మాత్రం సంక్షేమ పథకాల అమలు విషయంలో మాత్రం రాజీ పడటం లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వరాలను గుర్తు చేసుకుని ఆయా వర్గాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు.