సమతామూర్తి కేంద్రంలో 150 మంది ప్రముఖుల చిత్రాలు..?

Chakravarthi Kalyan
శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో కొలువుదీరిన సమతామూర్తి కేంద్రం ఇప్పుడు వార్తల్లో ప్రదేశంగా నిలుస్తోంది. 216 అడుగుల ఎత్తైన శ్రీ రామానుజాచార్యల విగ్రహాన్ని మొన్న స్వయంగా ప్రధాని మోడీ వచ్చి ప్రారంభించారు. ఈ సమతామూర్తి కేంద్రంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. మరికొన్ని అదనంగా ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.


సమతామూర్తి కేంద్రంలో హాల్ ఆఫ్ ఫ్రేమ్ ఏర్పాటు ఏర్పాటు చేయబోతున్నారు. సమతామూర్తి కేంద్రంలో ఏర్పాటు చేసే హాల్ ఆఫ్ ఫ్రేమ్ లో లింకన్, లూథర్‌కింగ్, మండేలా వంటి వారి చిత్రాలను హాల్ ఆఫ్‌ ఫ్రేమ్‌గా ఏర్పాటు చేస్తారు. జాతి వివక్ష, అసమానతలపై ఉద్యమించిన వారిని స్మరించుకుంటారు. మొత్తం 150 మంది చిత్రాలతో హాల్ ఆఫ్ ఫ్రేమ్ కేంద్రం ఏర్పాటు చేయబోతున్నట్టు చినజీయర్ స్వామి తెలిపారు. దేశంలో సమాజ సేవ.. మంచి జరగాలని ఆకాంక్షించిన చినజీయర్‌స్వామి.. అన్ని రాష్ట్రాల్లో అన్ని వర్గాలకు క్షేమం జరగాలని ఆకాంక్షించారు. సమతా స్ఫూర్తిని సమాజానికి అందించాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: