మోడీ వ్యాఖ్యలు: కేటీఆర్ సంచలన నిర్ణయం..?
మోడీ వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బిజెపి పార్టీ దిష్టిబొమ్మల దహనం చేయాలని కేటీఆర్ పిలుపు ఇచ్చారు. నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కేటీఆర్ తెలిపారు.
అసలు ఇంతకీ ప్రధాని మోడి ఏమన్నారంటే.. కాంగ్రెస్కు ప్రజలన్నా, ప్రజాఆకాంక్షలన్నా లెక్కలేదని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అడ్డగోలుగా విభజించిందని విమర్శించారు. గతంలో బీజేపీ ముడు రాష్ట్రాలు ఇచ్చినా ఎక్కడా గొడవలు జరగలేదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్కు ప్రజాస్వామ్యం అంటే పడదని ప్రధాని మోడీ విమర్శించారు.