యూపీలో తొలివిడత పోలింగ్.. ఆ కులం ఓట్లే కీలకం..?
ఈ 58 నియోజకవర్గాల నుంచి 623 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. యూపీలో తొలి విడత పోలింగ్‌లో 9 మంది మంత్రులు బరిలో ఉన్నారు. తొలి విడతలో మొత్తం 2.27 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. మెుత్తం ఏడు దశల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తొలిదశ పోలింగ్‌లో జాట్ వర్గానిది కీలకపాత్ర కానుంది. పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లో అధికంగా జాట్లు ఉన్నారు.