పాక్‌ యూట్యూబ్‌ ఛానళ్లకు ఇండియా షాక్..?

Chakravarthi Kalyan
ఇండియా వ్యతిరేక ప్రచారం చేసే సోషల్ మీడియా వేదికలకు ఇండియా షాక్ ఇస్తోంది. భారత వ్యతిరేక వార్తలను వ్యాప్తి చేస్తున్న అనేక యూట్యూబ్‌ ఛానళ్లను, వెబ్‌ సైట్లను, ఇతర సామాజిక మాధ్యమాల ఖాతాలను బ్లాక్ చేస్తోంది. ఈ విషయాన్ని సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ రాజ్యసభలోనే వెల్లడించారు. గత రెండునెలల్లోనే పాకిస్ధాన్‌కు చెందిన 60కి పైగా సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్‌ చేసినట్లు కేంద్రం రాజ్యసభలో తెలిపింది.


ఇకపై పాత్రికేయులు కూడా కోడ్‌ పాటించాల్సి ఉంటుందని.. అలా పాటించకపోతే ప్రెస్‌ కౌన్సిల్‌ చట్టం ప్రకారం చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించారు. ఇప్పటికే ఇలాంటి 150కి పైగా కేసుల్లో గట్టి చర్యలు తీసుకున్నట్టు కేంద్ర మంత్రి మురుగన్‌ తెలిపారు. అంతే కాకుండా తప్పుడు వార్తల ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసామని మంత్రి తెలిపారు. ఇండియా వ్యతిరేక వార్తలను ప్రసారం చేస్తున్న యూట్యూబ్‌లో నడిచే 35 వార్తా ఛానళ్లు, మరో 2 వెబ్‌సైట్లను జనవరి 21న బ్లాక్‌ చేసినట్లు కేంద్ర మంత్రి వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: