బ్రేకింగ్: షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డ విశాల్..?
ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన సోషల్ మీడియా త్వారా అభిమానులతో పంచుకున్నారు విశాల్. ఆయన కేరళలో చికిత్స చేయించుకుని కొన్నిరోజులు అక్కడే విశ్రాంతి తీసుకుంటారు.
తాను విశ్రాంతి, చికిత్స కోసం కేరళ వెళ్తున్నానని ఆయన తన పోస్టులో తెలిపారు. మళ్లీ మార్చి మొదటి వారంలో లాటీ సినిమా తుది దశ షెడ్యూల్‌లో పాల్గొంటానంటూ ఆయన తన పోస్టులో వివరించారు. ఈ షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో విశాల్ చేతి ఎముకలకు దెబ్బ తగిలినట్లు సమాచారం వస్తోంది. ఆయన పోస్టు చేసిన వీడియోలో ఓ పోలీసు అధికారిగా విశాల్ కనిపించారు. పాన్ ఇండియా స్థాయిలో తీస్తున్న లాఠీ సినిమాకు ఎ. వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.