జూబ్లీహిల్స్: కార్లలో మంటలు.. ఎన్ని కాలిపోయాయంటే?
ఈ ఘటన హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లో జరిగింది. పార్కింగ్‌లో నిలిపిన నాలుగు కార్లు దగ్ధమైపోయాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళం సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. ఇలా అనుకోకుండా దగ్ధమైన కార్లలో ఖరీదైన రేంజ్ రోవర్ కారుతో పాటు మరో మూడు ఖరీదైన కార్లు ఉన్నాయని తెలుస్తోంది. అయితే మంటలకు కారణం ఏంటి.. ఇది ఎవరైనా కావాలని చేశారా.. లేక నిజంగానే ప్రమాదం జరిగిందా అన్న విషయం దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌లు చెక్ చేస్తున్నారు.