పెళ్లింట్లో పెను విషాదం.. 11 మంది మృతి..?
వివాహ వేడుకలకు వచ్చిన బంధువులు.. ఓ బావిపై ఉన్న స్లాబ్పై కూర్చుకున్నారు. అయితే.. ఒకేసారి ఎక్కువ మంది కూర్చోవడం వల్ల ఆ బావిపైనున్న స్లాబ్ కుప్పకూలిపోయింది. దీంతో సందర్భంగా బావిపై ఉన్న స్లాబ్ మీద కూర్చున్న బంధువులు ఒక్కసారిగా బావిలో పడిపోయారు. బావిలో ఒకేసారి 11 మంది వరకూ పడిపోవడంతో ఊపిరి ఆడక చనిపోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు. ఈ ప్రమాదంపై యూపీ సర్కారు స్పందించింది. యూపీ సీఎం యోగి మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.