దీప్ సిద్ధూ మరణాంతరం తన ప్రియురాలి ఎమోషనల్ పోస్ట్..!!
పంజాబీ నటుడు, ఎర్రకోట నిరసనల్లో నిందితుడు దీప్ సిద్ధూ హర్యానాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సాగు చట్టాల వ్యతిరేక నిరసనల్లో భాగంగా గతేడాది రిపబ్లిక్ డే సందర్భంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన విషయం గుర్తుకు ఉండే ఉంటుంది. అప్పుడు దీప్ సిద్ధూ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఆ సమయంలో కొందరు ఆందోళన కారులను రెచ్చగొట్టి ఎర్రకోటకు మళ్లించారనే ఆరోపణ అతనిపై ఉంది. అయితే రోడ్డు ప్రమాదంలో మంగళవారం నాడు మరణించాడు. ప్రమాద సమయంలో అతనితోపాటు ఆయన ప్రియురాలు రీనా రాయ్ కూడా ఉంది. అదృష్టవశాత్తు ఆమె ప్రాణాల నుంచి బయట పడింది.
ప్రస్తుతం రీనా రాయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ మేరకు తన ప్రియుడు దీప్ సిద్ధూ మరణంపై ఎమోషనల్ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వారిద్దరు కలిసి దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ మేరకు తన ఆత్మకు శాంతి చేకూరాలని, ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘‘నా హృదయం ముక్కలైంది. సిద్ధూ లేని జీవితం అంధకారంలా ఉంది. నన్ను వదిలి వెళ్లిపోనని చెప్పిన వ్యక్తే.. నాకు అందనంత దూరానికి వెళ్లిపోయాడు. ఇద్దరం మా భవిష్యత్ ఇలా ఉండాలి.. అలా ఉండాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ నన్ను మధ్యలోనే నన్ను వదిలేసి వెళ్లిపోయారు.’’ అంటూ రీనా ఎమోషనల్గా రాసుకొచ్చారు.