మీ జోక్యం వద్దు.. ప్రపంచ దేశాలకు రష్యా వార్నింగ్..
ఉక్రెయిన రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా దాడులు ప్రారంభించింది. రష్యన్ సైన్యాలు ఉక్రెయిన్ సరిహద్దులను దాటి లోపలికి చొచ్చుకుపోతున్నాయి. ఈ మిలటరీ చర్యపై మాట్లాడిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. ఎవరైనా జోక్యం చేసుకుంటే విపరీత పరిణామాలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఆయుధాలు వదిలిన ఉక్రెయిన్ సైనికుల జోలికి వెళ్లబోమన్న పుతిన్ ... ఆయుధాలు విడిచిపెట్టిన సైనికుల ప్రాణాలకు హామీ ఇచ్చారు.