యూపీలో ఐదో విడత పోలింగ్.. వీరే కీలకం..?
ఈ ఐదో విడత ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటలుగా గతంలో భావించిన అమేధీ, రాయ్‌బరేలీ కూడా ఉన్నాయి. వీటితోపాటు రామమందిర ఉద్యమానికి కేంద్రమైన అయోధ్యలో కూడా ఇవాళ పోలింగ్ ఉంది. ఈ నియోజక వర్గాలతో పాటు సుల్తాన్‌పుర్, చిత్రకూట్, ప్రతాప్‌గఢ్, కౌశాంబి, ప్రయాగ్‌రాజ్, బారాబంకి, బహ్రయిచ్, శ్రావస్తి, గోండా జిల్లాల్లో కూడా ఇవాళే పోలింగ్ జరుగుతుంది.
ఇక బరిలో ఉన్న ప్రముఖులు ఎవరంటే.. ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యతో పాటు పలువురు మంత్రులు ఇవాళ అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నారు. ఇక యూపీలో మార్చి 3, 7 తేదీల్లో 6, 7 విడతల ఎన్నికలు జరుగుతాయి.