కేసీఆర్.. మహిళా గవర్నర్ను అవమానిస్తావా..?
ఆయన ఏమన్నారంటే.. “ గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభిస్తున్నారని తెలుస్తుంది.. కేసీఆర్ కు మతి స్థిమితం తప్పినట్టుంది. మోదీని చుస్తే కేసీఆర్ కు ఇలా అవుతోంది.. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలంగా చేసిన పనులు గవర్నర్ ప్రసంగం ద్వారా చెబుతారు. కానీ సంవత్సరం నుంచి మీరు చేసింది ఏమీ లేదు... అందుకే గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారు.. ఒక మహిళ గవర్నర్ అని చూడకుండా గవర్నర్ ను అవమానిస్తారు. మీరు.. రాజ్యాంగ పదవిని అవమాన పరుస్తున్నారు..” అంటూ రాజాసింగ్ విమర్శించారు.