ఇక క్రికెట్ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త చెప్పింది బీసీసీఐ. కొద్దిసేపటి క్రితమే ఐపీఎల్ 2022 టోర్నీ పూర్తి షెడ్యూల్ విడుదల అయింది. ఐపీఎల్ 2022 షెడ్యూల్ ను రిలీజ్ చేసింది బీసీసీఐ పాలక మండలి.ఇక ఫిబ్రవరి 25 వ తేదీన జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో లీగ్ షెడ్యూల్ పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇవాళ ఐపీఎల్ 2022 టోర్నీ పూర్తి షెడ్యూల్ విడుదల అవ్వడం అనేది జరిగింది.
ఇక మార్చి 26వ తేదీన మొదలయ్యే ఐపీఎల్ 2022 సీజన్ 15… మే 29న ఫైనల్ తో ఎండ్ కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా రన్నరప్ కోల్కత్తా నైట్ రైడర్స్ మధ్య వాంఖడే స్టేడియంలో మొదటి మ్యాచ్ జరగనుంది. ఇక చివరి 70వ లీగ్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకా పంజాబ్ కింగ్స్ మధ్య స్టేడియంలోనే జరగనుంది. ఆ తర్వాత ప్లే ఆప్ ఇంకా ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. ఇక పూర్తి వివరాలు కింది ట్వీట్ లో ఉన్నాయి.