రష్యా అరాచకం: ఆస్పత్రులపైనా దాడి..?
రెండు వారాలుగా ఉక్రెయిన్‌పై రష్యా దళాల దండయాత్ర కొనసాగుతూనే ఉంది. చివరకు ఆస్పత్రులు, శ్మశానవాటికలపైనా రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి. రష్యా దాడుల కారణంగా మౌలిక సదుపాయాలు ధ్వంసమై ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో తాగునీరు లేక జనం అల్లాడుతున్నారు. ఆస్పత్రుల్లోని రోగులకూ అందని ఆహారం, ఔషధాలు అందడం లేదు. మరియుపొల్ ఓడరేవు నగరాన్ని రష్యా బలగాలు చుట్టుముట్టాయి. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా దళాల దాడిలో 10 మంది ఉక్రెయిన్ పౌరులు మృతి చెందారు.