ఆర్టీసీలో మళ్లీ సమ్మె సైరన్? సమ్మె తేదీలు ఇవే..?
అయితే.. ముందుగా నిరసన తెలిపి.. ఆ తర్వాత సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నిర్ణయించింది. ఈనెల 13 నుంచి 21 వరకు అన్ని డిపోల్లో కార్మికులతో సమావేశాలు నిర్వహించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నిర్ణయించింది. కార్మికులతో సమావేశాలు నిర్వహించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస తెలిపింది. సమ్మె నిర్వహణపై ఈనెల 24న ఆన్లైన్ అభిప్రాయ సేకరణ జరుపుతారు. ఈనెల 28, 29 తేదీల్లో సార్వత్రిక సమ్మె ఉంటుందని ఆర్టీసీ ఐకాస రాష్ట్ర కమిటీ ప్రకటించింది.