అమరావతి కోసం మరో పాదయాత్ర?
ఈ నేపథ్యంలో ఇప్పుడు అమరావతి ఉద్యమ కార్యకలాపాలు పెరిగాయి. ఇటీవలే మహిళలు న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతిలోని హైకోర్టు నుంచి తిరుపతి వరకూ పాదయాత్ర నిర్వహించారు. ఇప్పుడు అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు కూడా పాదయాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు. మార్చి 12న మొదలవుతున్న ఈ పాదయాత్ర మార్చి 31న ముగుస్తుంది. అంటే దాదాపు 20 రోజుల పాటు పాదయాత్ర ఉంటుందన్నమాట. మరి ఈ యాత్ర కొలికపూడికి ఇమేజ్ తీసుకొస్తుందా.. అమరావతిని కాపాడుతుందా అన్నది వేచి చూడాలి.