హైదరాబాద్‌లో దారుణం: కుక్క నోట బాలుడి తల
ఎల్బీనగర్కు చెందిన కార్తీక్ మన్సూరాబాద్‌లోని సహారా రోడ్డులో మొదట ఈ దృశ్యం చూశాడు. బాలుడి తలను కుక్క నోటకరుచుకుని వెళ్లడం చూసి హతాశయుడయ్యాడు. కుక్కను వెంబడిస్తే అది సహారా ప్రహరీగోడ దగ్గర బాలుడి తల వదిలేసి వెళ్లింది. పోలీసులు బాలుడి తలను పోస్టుమార్టం కోసం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.