ఉక్రెయిన్‌: యుద్ధభూమిలో అమెరికా జర్నలిస్ట్‌ మృతి

Chakravarthi Kalyan
ఉక్రెయిన్ పై రష్యా జరుపుతున్న దాడుల్లో అమెరికాకు చెందిన ఓ జర్నలిస్టు మరణించాడు. న్యూయార్క్ టైమ్స్ కు చెందిన బ్రెంట్  రెనాడ్  రష్యా దాడుల్లో గాయపడిన అక్కడికక్కడే మృతి చెందాడు. కీవ్ సమీపంలోని ఇర్పిన్  ప్రాంతంలో న్యూయార్క్ టైమ్స్ కు చెందిన బ్రెంట్  రెనాడ్  విధులు నిర్వహిస్తుండగా ఈ దారుణం జరిగినట్టు ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. ఈ దాడి జరిగిన సమయంలో అతడితో పాటు ఉక్రెయిన్ కి చెందిన జర్నలిస్టు కూడా ఆ ప్రదేశంలో ఉన్నారు.


రష్యా సైన్యం జరిపిన దాడుల్లో న్యూయార్క్ టైమ్స్ కు చెందిన బ్రెంట్  రెనాడ్ తో పాటు ఆయనకు కూడా గాయాలు అయ్యాయి. న్యూయార్క్ టైమ్స్ కు చెందిన బ్రెంట్  రెనాడ్  మరణించగా.. ఉక్రెయిన్‌ జర్నలిస్టును ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమెరికా జర్నలిస్టు మృతిపై ఆ దేశం ఎలా స్పందిస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: