ఇంటర్‌ విద్యార్థులకు షాక్‌.. మళ్లీ మారేనా?

Chakravarthi Kalyan
తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్ విద్యార్థులకు ఇది షాకింగ్‌ న్యూసే.. ఇప్పటికే ఒకసారి మారిన ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మళ్లీ మారే అవకాశం కనిపిస్తోంది. దీని వల్ల ఇంటర్‌, పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ కూడా మారే అవకాశం ఉంది. ఇంటర్‌ పరీక్షల తేదీలపై జేఈఈ మెయిన్స్‌ షెడ్యూల్‌ ప్రభావం కారణంగా ఈ మార్పు చోటు చేసుకుంటోంది. జేఈఈ మెయిన్‌ పరీక్షల వల్ల మరోసారి ఇంటర్ షెడ్యూల్ మారనుంది.


జేఈఈ మెయిన్‌ పరీక్షలు ఏప్రిల్‌ 16కు బదులు 21 నుంచి ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ తేదీల్లో ఇప్పటికే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు. అందువల్ల ఇంటర్‌, పదో తరగతి పరీక్షలు తప్పనిసరిగా మారే అవకాశం ఉంది. ఈ మార్పులపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అందువల్ల ఇంటర్, పది తరగతులు విద్యార్థులు పరీక్షలకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండటం మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: