హోలీ.. ఈ రూల్స్ పాటించకపోతే జైలుకే?
గురువారం ఉదయం 6గంటల నుంచి 19 వ తేదీ ఉదయం 6గంటల వరకూ మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలు జరుపుకోవడంపై నిషేధం విధించారు. అంతే కాదు.. సంబంధం లేని వ్యక్తులపై, వాహనాలపై, భవనాలపై రంగులు పోయడం నిషేధం విధించారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అందుకే నిబంధనలు పాటిస్తూ హ్యాపీగా హోలీ చేసుకోండి.