జగన్ అదిరిపోయే నిర్ణయం.. తిక్క కుదురుతుందిక?
ఈ ఆస్పత్రుల్లో పని చేసే వైద్యులు, సిబ్బందికి బయో మెట్రిక్ హాజరు తప్పనిసరి చేసింది. బయో మెట్రిక్ పర్యవేక్షణ కోసం ఆస్పత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విధులకు వచ్చి అనుమతి లేకుండా బయటికి వెళ్లిన వారి సెలవుల్లో కోత విధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఆసుపత్రుల్లోని పని దొంగలకు తాళం పడనుంది. ప్రభుత్వ వైద్యులు అధిక మొత్తంలో జీతాలు తీసుకుంటున్నా సమయానికి అందుబాటులో ఉండరన్న విమర్శలు ఉన్నాయి. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆరోపణలు మరీ ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వైద్యం కోసం ఎక్కువ మొత్తం డబ్బు ఖర్చు చేసే పరిస్థితి ఉండదు.