వావ్.. దేశంలో కరోనా ఎంత తగ్గిందో తెలుసా?

Chakravarthi Kalyan
దేశంలో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టేసింది. కొన్ని దేశాల్లో భారీగా కేసులు వస్తున్నా.. ఇండియాలో మాత్రం కేసులు బాగా తగ్గుతున్నాయి. వరుసగా రెండో రోజూ ఇండియాలో కేసులు 2వేల దిగువనే నమోదు అయ్యాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం గత  24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కేవలం 1549 మందికి మాత్రమే కరోనా సోకింది. దేశవ్యాప్తంగా 3.84లక్షల వైరస్‌ పరీక్షలు నిర్వహించగా ఈ ఫలితాలు వచ్చాయి. దీని ప్రకారం ఇండియాలో పాజిటివిటీ రేటు 0.40శాతానికి తగ్గిపోయింది. తాజాగా 2,652 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో  రికవరీ రేటు 98.74శాతానికి ఎగబాకింది. గత  24 గంటల వ్యవధిలో దేశంలో 31 మంది కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులు తగ్గడంతో క్రియాశీల కేసుల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ సంఖ్య 25,106గా ఉంది. దేశంలో క్రియాశీల రేటు 0.06శాతానికి తగ్గింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: