ఆ టీడీపీది కార్యకర్త హత్యే? అయ్యన్న అనుమానం?
ఇది హత్య అన్నది మా అంచనా అంటున్నారు అయ్యన్న.. కాళ్లు చేతులు కట్టేసి కాలవలో కళ్యాణ రాజు మృతదేహం లభించిందని.. దీనిపై నిగ్గు తేల్చాల్సిన పోలీసులు 45 రోజులుగా ఏమి సమాధానం ఇవ్వడం లేదని అయ్యన్న ఆరోపిస్తున్నారు. ఇప్పుడు గట్టిగా అడిగితే ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇవ్వాల్సిన పరిస్థితిలో నర్సీపట్నం వైద్యులు శవ పరీక్ష సమయంలో ఇచ్చిన రిపోర్టు పంపారని అయ్యన్న మండిపడ్డారు. అందుకే తమకు అనుమానాలు మరింతగా పెరిగాయని.. దీనిపై వాస్తవాలు తేల్చాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నానని అయ్యన్న అంటున్నారు. నాతవరం వెళ్లి పార్టీ కార్యకర్తలతో పోలీసులను ప్రశ్నించడానికి మాజీ మంత్రి అయ్యన్న సిద్ధమయ్యారు.