నిజామాబాద్ బీజేపీ యంపీ ధర్మపురి అరవింద్ కి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. సీఎం కేసీఆర్, కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో అరవింద్‌కు నాన్ బెయిలబుర్ వారెంట్ ఇష్యూ అయ్యింది. కోర్టులో కేసు విచారణకు హాజరుకాలేదని అరవింద్ ఈ వారంట్ ఇచ్చారు. 2020 నవంబర్ 23న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అరవింద్‌పై కేసు నమోదు అయ్యింది. కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్న టీఆరెస్ పార్టీ ప్రచారానికి సంబంధించిన ఫెక్సీలను,హోర్డింగ్ లని బిజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరియు అతని అనుచరులు చింపివేశారని.. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటిఆర్ ను అనేక రకాలుగా తిడుతూ మాట్లాడారని అప్పటి టీఆరెస్ పార్టీ సెక్రెటరీ హోదాలో ఉన్న ఇప్పటి ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ధర్మపురి అరవింద్ పై ఛార్జ్ షీట్ కోర్ట్ లో దాఖలు చేశారు.