వరుసగా నాలుగో రోజూ పెరిగిన పెట్రోల్‌ ధరలు?

Chakravarthi Kalyan
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి.. ఇలా పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగడం ఇది వరుసగా నాలుగో రోజు.. తాజాగా పెట్రోల్‌పై 89పైసలు, డీజల్‌పై 86 పైసలు వడ్డించాయి చమురు సంస్థలు. పెరిగిన రేట్ల ప్రకారం హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.111.80కు చేరింది. ఇక హైదరాబాద్‌లో డీజిల్ ధర రూ.98.10కు చేరింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ ధరలపై సంయమనం పాటించింది. కానీ ఇప్పుడు ఎన్నికలు ముగిసిపోయాయి. ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాలు కూడా జరిగిపోయాయి. అందుకే ఇక కేంద్రం తన కొరడా బయటకు తీసింది. రోజూ ఎంతో కొంత పెట్రోల్ ధరలు పెంచుతూ పోతోంది. ఈ దూకుడు చూస్తే.. తర్వలోనే పెట్రోల్, డీజిల్‌ ధరలు రూ. 150 మార్కు చేరుకుంటుందేమో అని ప్రజలు భయపడుతున్నారు. దీనికి తోడు ఉక్రెయిన్ యుద్దం కూడా ఈ ధరల పెరుగుదలకు మరో కారణంగా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: