చిత్తూరు జిల్లాలో ఘోరం: లోయలో పడ్డ పెళ్లి బస్సు?
విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు అందిస్తున్నారు. అయితే.. ఘటనాస్థలిలో చీకటి కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో పెళ్లి బస్సులో 60 మంది వరకూ ఉన్నట్లు గాయపడిన వారు చెబుతున్న సమాచారం. క్షతగాత్రులను అంబులెన్స్‌లో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.