తెలంగాణ సీఎం
కేసీఆర్ స్వయంగా ఓ రైతు అన్న విషయం తెలిసిందే.
మెదక్ జిల్లాలో ఆయనకు ఓ వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడే ఓ గెస్ట్ హౌజ్ కూడా ఉంది.
కేసీఆర్ ఏడాదిలో సగం రోజులు తన ఫామ్ హౌస్‌లోనే ఉంటారని విమర్శలు కూడా ఉన్నాయి. అలాగే
కేసీఆర్ వ్యవసాయంపై ఎంతో మక్కువ చూపుతారు. అయితే..
కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో వరి పండిస్తున్నారా..
గంజాయి పండిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు
బీజేపీ నేతలు. ఇటీవల టీఆర్ఎస్,
బీజేపీ మధ్య మాటల మంటలు పెరిగిన సంగతి తెలిసిందే.
తెలంగాణ ధాన్యాన్ని కేంద్రం కొనడం లేదని
కేసీఆర్ విమర్శిస్తున్నారు. దీనిపై స్పందించిన
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. సీఎం
కేసీఆర్ తన ఫాంహౌస్ లో వరి పండిస్తున్నారా..
గంజాయి పండిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు.
కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో పండిన పంటను ఎక్కడ అమ్ముతారని ప్రశ్నించారు బండి సంజయ్. ఏడేళ్ళుగా లేని సమస్యను
కేసీఆర్ సృష్టిస్తున్నాడని బండి సంజయ్ విమర్శించారు.