మళ్లీ పెరిగిన ఆర్టీసీఛార్జీలు.. తక్షణమే అమలు!?

Chakravarthi Kalyan
మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. అదేంటి మొన్ననే కదా వాయించేశారు.. అంటారా.. అవును.. అయితే ఏంటి మళ్లీ పెంచకూడదా.. అయితే.. మొన్నటి పెంపు రొటీన్ పెంపు కాదు.. ఇది కాస్త ప్రత్యేకం. చిల్లర సమస్యను తీర్చేందుకు మొన్న కొన్ని సర్వీసులకు తెలంగాణ ఆర్టీసీ చార్జీలు పెంచింది. ఇప్పుడు అవి కాకుండా మరికొంత వడ్డించింది.

ఈసారి తెలంగాణ ఆర్టీసీ కొత్తగా ప్యాసింజర్స్ సెస్ పేరుతో వడ్డన చేసింది. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5 పెంచుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10 వరకు ఛార్జీలు పెంచేశారు. అయితే సాధారణంగా ఆర్టీసీ చార్జీలు పెంచేటప్పుడు ముందుగానే సమాచారం ఇస్తారు. దీనిపై ముందే అలర్ట్ చేస్తారు. కానీ ఈసారి ఉన్నట్టుండి చెప్పాపెట్టకుండా చార్జీలు పెంచేశారు. అకస్మాత్తుగా ఇలా ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈ పెరిగిన ఛార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని  తెలంగాణ ఆర్టీసీ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: