స్టైలిష్ స్టార్
అల్లు అర్జున్ చందనం స్మగ్లర్గా నటించిన పుష్ప
సినిమా ఇండియా మొత్తం ఎంత క్రేజ్ సంపాదించుకుందో తెలుసు కదా.. కానీ రియల్ లైఫ్లోనూ చాలా మంది పుష్పరాజ్లు ఉన్నారు. అలాంటి ఓ పుష్ప రాజ్కు ఈడీ ఇవాళ షాక్ ఇచ్చింది. ఎర్రచందనం స్మగ్లర్ సెల్వ
రాజ్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. తమిళనాడు, పుదుచ్చేరిలో రూ.8 కోట్ల విలువైన సెల్వ
రాజ్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.. ఏపీ పోలీసులు,
చెన్నై కస్టమ్స్ విభాగం నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ స్మగ్లర్ సెల్వరాజ్ వ్యవహారంపై విచారణ జరిపింది. ఎర్రచందనం స్మగ్లింగ్ తో సెల్వ
రాజ్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ విచారణలో వెల్లడి అయ్యింది. సెల్వ రాజ్ తన ఆస్తులను
సంజన మెటల్ వేర్
ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కూడబెట్టినట్టు ఈడీ గుర్తించింది. ఆ ఆస్తులను జప్తు చేసింది.