తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న క్రమబద్దీకరణ అవకాశం గడువు ముగుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నేటితో క్రమబద్ధీకరణ గడువు ముగుస్తోంది. తెలంగాణలో ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకున్నవారికి ఉచితంగా, చెల్లింపు పద్ధతుల్లో క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇలా ఇచ్చిన అవకాశం గడువు ఇవాళ్టితో ముగుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం క్రమబద్దీకరణకు కొన్నిరోజుల క్రితం 58,59 జీవోలు విడుదల చేసింది. వీటి ప్రకారం క్రమబద్దీకరణకు కింద దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు జీవో నం.58 కింద 87,520 దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు జీవో నం.59 కింద 59,748 దరఖాస్తులు వచ్చినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇవాళే ఆఖరి రోజు కాబట్టి.. క్రమబద్దీకరణ చేసుకునేవారు త్వరపడితే మంచిది. ఇలాంటి అవకాశాలను ప్రభుత్వం ప్రకటించినప్పుడే అంది పుచ్చుకోవాలి.. ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడు మేలుకోకపోతే.. ఆ తర్వాత ఎంత మొత్తుకున్నా లాభం ఉండదు.