Breaking : జులై 5 నుంచి బల్కం పేట ఎల్లమ్మ బోనాలు!

Purushottham Vinay
ఇక బల్కంపేట ఎల్లమ్మ బోనాల గురించి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. జులై 5వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం జరుగుతుందని.. అదే రోజు నుంచి ఎల్లమ్మ బోనాలు అనేవి ప్రారంభం కానున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మ వారికి 2.5 కిలోల బంగారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనం సమర్పిస్తుందని కూడా ఆయన వెల్లడించారు.



అలాగే.. బంగారు తాపడంతో రుద్రాక్ష మండపం నిర్మాణం నిర్మిస్తామని కూడా ప్రకటన చేశారు.ఇక బల్కంపేట ఎల్లమ్మ అమ్మ వారి దర్శనానికి వచ్చే అనేక మంది భక్తుల కోసం 5 కోట్లతో మల్టి లెవెల్ పార్కింగ్ నూతన భవనం నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అలాగే 50 లక్షలతో 48 షాప్ లతో నూతన కాంప్లెక్స్ ఇంకా అలాగే 36 లక్షలతో భారీ రేకుల షెడ్డు నిర్మాణం చేపడతామని కూడా ఆయన ప్రకటన చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: