ఏం జగనన్నా.. మా డబ్బు దొంగిలిస్తావా?

Chakravarthi Kalyan
పంచాయతీ నిధులను ప్రభుత్వం దొంగిలించిందంటూ సర్పంచుల మండిపడుతున్నారు. రాత్రికి రాత్రే పంచాయతీ ఖాతాల్లోని డబ్బులు మాయం చేసిందంటూ సర్పంచులు నిరసనలకు దిగారు. ప్రభుత్వం లాక్కున్న పంచాయతీ నిధులు తిరిగివ్వాలని...సర్పంచులు డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భిక్షాటన నిర్వహించారు. గ్రామ పంచాయతీల ఖాతాల్లో నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రే డబ్బులు దొంగలించిందని సర్పంచులు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ గాంధీ విగ్రహాల వద్ద నిరసనకు దిగుతున్నారు. పంచాయతీ నిధుల మాయంపై పలు జిల్లాల్లో సర్పంచుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే తమ నిధులను ఖాతాల్లో జమ చేయాలని, లేదంటే తడాఖా చూపుతామని హెచ్చరిస్తున్నారు. పంచాయితీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవటాన్ని నిరసిస్తూ... సర్పంచులు భిక్షాటనలు చేస్తున్నారు. తమ నిధులు వాడుకోవటం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వీరి గోడు జగన్ పట్టించుకుంటారా? ఏమో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: