ఆ జిల్లాలకు జగన్ షాక్‌.. ఒక్క మంత్రీ లేడు?

Chakravarthi Kalyan
జగన్ కొత్త కేబినెట్‌లో కొన్ని జిల్లాలకు అసలు అవకాశం లేకుండాపోయింది.. మొత్తం 8 జిల్లాలకు ఒక్క మంత్రి వర్గ పదవి అవకాశం కూడా దక్కలేదు. జిల్లాల విభజన తర్వాతే  మంత్రి వర్గం పునర్ వ్యవస్థీకరిస్తామని.. జిల్లాకో మంత్రి ఉండేలా చర్యలు తీసుకుంటామని అధికార పార్టీ ఎమ్మెల్యేలకు  గతంలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. పార్లమెంట్ కు  కొత్త జిల్లా రావడంతో పోటీ తగ్గి తమకు అమాత్య పదవులు వస్తాయని చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. జిల్లాల్లో మారిన సామాజిక సమీకరణాలను లెక్కలు వేసుకుని తమకు ఈసారి మంత్రి పదవి ఖాయమని లెక్కలేసుకున్నారు. కొందరైతే.. మంత్రి అయ్యాకే  శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తామంటూ చాలా కార్యక్రమాలను నిలిపివేశారు. మంత్రిగానే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామంటూ ప్రచారం చేశారు. కానీ.. ఇప్పుడు లిస్ట్ చూస్తే..  కొత్త జిల్లాల ప్రాతిపదికను సీఎం జగన్ పక్కన పెట్టేసినట్టు అర్థం అవుతోంది. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో  8 జిల్లాల్లో అసలు మంత్రులే లేకుండా పోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: