మారిన రష్యా వ్యూహం.. ఉక్రెయిన్ పరిస్థితి మరీ దారుణం?
ఇలాంటి సమయంలో రష్యా ఓ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌తో తదుపరి చర్చల సమయంలో దాడులు మాత్రం ఆపేది లేదంటోంది రష్యా. చర్చలను కొనసాగించకపోవడానికి తనకు ఎటువంటి కారణాలూ కనిపించడం లేదన్న విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్... మళ్లీ సమావేశమైనప్పుడు మాత్రం రష్యా తన ప్రత్యేక సైనిక ఆపరేషన్‌ను నిలిపివేయదన్నారు. గతంలో చర్చల సందర్భంగా సైనిక చర్య నిలిపివేతకు పుతిన్ ఆదేశించారని లావ్రోవ్ చెప్పారు. కానీ.. ఈసారి తమ వైఖరి మారిందని రష్యా అంటోంది.