నేటి నుంచి పవన్ కల్యాణ్ యాత్ర?
అనంతపురం జిల్లాలోని కొత్తచెరువు, గొట్లూరు, పూలకుంట, మన్నీల ప్రాంతాల్ల ఇవాళ పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ యాత్రలో భాగంగా మన్నీలలో పవన్ కల్యాణ్ రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారు. రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. రైతుల కష్ట సుఖాలు పంచుకోనున్నారు. కౌలు రైతుల కుటుంబాలను ఆదుకుంటామని ఇటీవల పవన్ కల్యాణ్ తాజా పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇందుకు తన వంతుగా రూ. 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. నాగబాబు కూడా తన వంతు విరాళం ఇచ్చారు.