మొన్న ఏపీలో జగన్ చేసిందే.. ఇప్పుడు కేసీఆర్‌ చేశాడుగా?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్.. తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇద్దరూ ఒకే సమయంలో తెలుగు రాష్ట్రాలకు సీఎంలుగా ఉన్నందువల్ల వీరి పరిపాలనపై పోలిక తప్పకుండా వస్తుంది. జగన్ చేసిన అన్ని పనులు కేసీఆర్ చేయలేరు. కేసీఆర్ చేసినవన్నీ జగన్ కూడా చేయలేరు. ఎవరి ప్రయారిటీలు, ఎవరి వ్యూహాలు వారివి. అయితే ఒక్కోసారి జగన్ చేసిందే కేసీఆర్ చేస్తారు.. మరోసారి కేసీఆర్‌ చేసిందే జగన్ కూడా చేస్తుంటారు. ఇప్పుడు అదే జరిగింది. ఇటీవల ఏపీలో ఏ గ్రూప్ ఉద్యోగానికి కూడా ఇంటర్వ్యూ ఎత్తేశారు. నేరుగా రాత మార్కులతోనే ఎంపిక చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం కూడా అదే రూట్ ఫాలోఅయ్యింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇప్పుడు గ్రూప్ 1, 2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎత్తేసింది. అబ్బో సీఎం కేసీఆర్ కూడా జగన్‌ను ఫాలో అయ్యాడన్న టాక్ వినిపిస్తోంది. ఎవరు ఎవరిని ఫాలో అయినా ఇబ్బంది లేదు. ప్రజలకు అంతిమంగా మంచి జరగడమే ప్రధానం.. ఏమంటారు..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: