ఇవాళ ఆంధ్ర ప్రదేశ్‌లోని కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో.. పండు వెన్నెల్లో ఒంటిమిట్ట రాములోరి కల్యాణం జరగబోతోంది. ఇందుకు శ్రీ కోదండ రామాలయం శోభాయామానంగా ముస్తాబైంది. ఈ రాత్రి 8 నుంచి 10 గంటల వరకు అశేష భక్త జనుల సమక్షంలో ఈ కల్యాణం జరగబోతోంది. శ్రీరాముడు చంద్రుడికి ఇచ్చిన వరాన్ని అనుసరించి ఈ రాత్రి వేళ వివాహం జరగబోతోంది. తిరుమల నుంచి వచ్చిన వేద పండితుల ఆధ్వర్వంలో కల్యాణం నిర్వహించనున్నారు. మొత్తం 50 వేల మంది వీక్షించేలా తిరుపతి తిరుమల దేవస్థానం ఏర్పాట్లు చేసింది.
సాధారణంగా శ్రీరామ నవమి రోజు.. సీతారాముల కల్యాణం జరిపించడం ఆనవాయితీ.. భద్రాద్రి మొదలుకుని అనేక రామాలయాల్లో శ్రీరామ నవమిరోజే సీతారాముల కల్యాణం జరిపిస్తారు. కానీ.. ఒక్క ఒంటిమిట్టలోనే.. శ్రీరామ నవమి తదుపరి వచ్చే పౌర్ణమి వేళ ఈ కల్యాణం జరిపిస్తారు.