ఉక్రెయిన్‌ యుద్ధం: ఎంత అరాచకమో తెలుసా?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 2 నెలలు గడుస్తోంది. ఇంకా యుద్ధం కొలిక్కి రావడం లేదు. ఈ రెండు నెలలో జరిగిన దారుణాలో ఎన్నో తలచుకుంటేనే గుండె బరువెక్కుతుంది. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని పలు నగరాలు దాదాపు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఉక్రెయిన్‌కు చెందిన వేల మంది పౌరులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాదాపు 50 లక్షల మంది ఉక్రెయిన్ వాసులు దేశాన్ని విడిచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. అంతేనా.. వేలమంది బంకర్లు, ఇతర ప్రాంతాల్లో అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని.. తలదాచుకుంటున్నారు. లక్షల మంది రోజూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన ప్రజలను తరలించేందుకు వీలుగా యుద్ధానికి విరామం ఇవ్వడం కూడా లేదు. ఉక్రెయిన్ లో 1.2కోట్ల మందికి మానవతా సాయం అవసరమని ఐక్య రాజ్య సమితి భావిస్తోంది. ఈ 1.2 కోట్లలో మూడోవంతు ప్రజలు డొనెట్స్క్, లుహాన్స్క్, మేరియుపొల్, ఖేర్సన్ నగరాల్లో ఉన్నట్టు ఐరాస చెబుతోంది. అంతే కాదు.. ఈ మానవతా సాయం కోరుకునే వారి సంఖ్య 1.57 కోట్లకు పెరిగొచ్చని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: