ఎలన్ మస్క్.. ప్రపంచం మెచ్చిన పారిశ్రామిక వేత్త.. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వేత్త తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా మరో 3కొత్త హోల్డింగ్ కంపెనీలను నమోదు చేయించారు. ఆయన తన వ్యాపారాలన్నింటినీ ఓ బిగ్ కంపెనీ కిందకు తెచ్చేందుకు యోచిస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ బిజినెస్ మేగజైన్ బ్లూమ్ బర్గ్ ఓ కథనంలో తెలిపింది. అమెరికాలో పన్ను ప్రయోజనాలు ఎక్కువగా ఉండే డెలావెర్ రాష్ట్రంలో ఎలన్ మస్క్ తన కొత్త కంపెనీలను రిజిస్టర్ చేయించారట.
ఈ కంపెనీల పేర్లు ఏంటంటే.. ఎక్స్ హోల్డింగ్స్ వన్, టు, త్రీ.. అంటే పేరు ఒకటే.. చివర్లో నెంబర్లు మారతాయన్నమాట. అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఈ విషయాన్ని మస్క్ తెలిపారు. ఆయన ఈ ఎక్స్ హోల్డింగ్స్-Iలో ఉంచిన సొమ్ముతోనే సామజిక మీడియా సంస్థను కొనుగోలుకు యత్నిస్తున్నాడట. ఇప్పటికే మస్క్‌కు ఉన్న టెస్లా, స్పేస్-ఎక్స్ వ్యాపారాలు ఉన్న సంగతి తెలిసిందే.