నవనీత్ కౌర్.. ఒకప్పటి తెలుగు హీరోయిన్.. తెలుగు తెరపై అందాలు ఆరబోసింది. కానీ ఇప్పుడు ఆమె ఓ ఎంపీగా ఎన్నికై రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తోంది. తాజాగా హనుమాన్ చాలీసా వివాదంతో అరెస్టై కటకటాల వెనుక ఉంది. భిన్నవర్గాల మధ్య శత్రుత్వాన్ని సృష్టిస్తున్నారనే అభియోగాలపై ఆమెను అరెస్టు చేశారు. అమ్రావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఎమ్మెల్యే రవిరాణా దంపతులకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించింది. మహారాష్ట్ర సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని రాణా దంపతులు ఇటీవల సవాల్ చేశారు.
దీంతో ముంబయిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భిన్నవర్గాల మధ్య శత్రుత్వాన్ని సృష్టించేందుకు యత్నించడం సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కల్గించారనే అభియోగాలపై పోలీసులు నవనీత్ దంపతులను అరెస్ట్ చేశారు. బాంద్రా కోర్టులో హాజరుపరిచారు. పోలీస్ కస్టడీలోకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరానా.. కోర్టు ఒప్పుకోలేదు. దీంతో నవనీత్ దంపతులకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.