అలాంటి జగన్‌కు అవే ఆలోచనలు.. లోకేశ్ చురకలు?
లోకల్ ఎమ్మల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూలగొట్టించిన ఇళ్లను బాధితులతో కలసి నారా లోకేశ్ పరిశీలించారు. మహిళలపై దాడులు చేసిన వారంతా స్వేచ్ఛగా బయట తిరుగుతుంటే ఏనాడైనా కమిషన్ ప్రశ్నించిందా అని నారా లోకేశ్ నిలదీశారు. బాధితులకు అండగా నిలవడం తాము చేసిన తప్పా అని నారా లోకేశ్ ప్రశ్నించారు. మాఫియారాజ్ ప్రభుత్వం ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. గుడివాడలో కాసినో నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోకుండా అన్యాయాన్ని అడ్డుకున్న అధికారులపైనే కేసులు పెడతారా అని లోకేష్ ఎదురు దాడి చేశారు.