చంద్రబాబు పొర్లుదండాలు పెట్టినా కష్టమే?

Chakravarthi Kalyan
పేదలకు మేలు జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందంటున్నారు వైసీపీ నేతలు. ప్రత్యేకించి  పేదలకు ఇళ్ల పట్టాలు అందకూడదని ప్రతిపక్ష నేత చంద్రబాబు పొర్లు దండాలు పెట్టినా ఆగదంటున్నారు. చందబాబు కోర్టుకు వెళ్లినా భగవంతుడు వైయస్‌ జగన్‌ వెంటే ఉన్నారని అంటున్నారు. అందుకే జగన్ సంకల్పం ఆగదని మంత్రి జోగి రమేష్‌ విశాఖలో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో అన్నారు.


ఇది చరిత్ర పుటల్లో నిలిచిపోయే రోజు..ఉత్తరాంధ్ర అక్కచెల్లెమ్మల చిరకాల వాంఛ నెరవేరే రోజు అన్న మంత్రి జోగు రమేశ్..  వైయస్‌ జగనన్న గూడు కల్పించిన గొప్ప రోజు ఇది అని గుర్తు చేసుకున్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీ, మైనారిటీల్లో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న జగన్ సంకల్పం ఎప్పుడో నెరవేరాల్సి ఉన్నా.. దుర్మార్గులు అడ్డుపడటంతో ఆలస్యమైందన్నారు మంత్రి జోగు రమేశ్. భగవంతుడు జగనన్న వెంట ఉన్నారు కాబట్టే ప్రజలకు అనుకూలంగా తీర్పులు వచ్చాయని మంత్రి అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: