ఏపీలో పదో తరగతి పరీక్ష పత్రాలు లీకవుతున్న వార్తలు రోజూ వస్తున్నాయి. పరీక్ష ప్రారంభం అయ్యాక.. వాట్సప్‌లో పేపర్లు ప్రత్యక్షం అవుతున్నాయి. అయితే.. పరీక్షా సమయం ప్రారంభం తర్వాత ఆ పై బయటకు వచ్చే ప్రశ్నా పత్రాన్ని లీకేజ్ అనరని మాల్ ప్రాక్టిస్ మాత్రమేనని విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ప్రకటించింది. పేపర్ లీక్ అన్నది అవాస్తవమని... తల్లిదండ్రులు, విద్యార్థులు వదంతులు నమ్మవద్దని కమిషన్ అంటోంది. దేశంలోనే ఏ రాష్ట్రం కూడా విద్య కోసం 29 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదని... పరీక్షలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కమిషన్ తెలిపింది. పరీక్షల నిర్వహణ ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా బాగున్నాయని గత రెండు రోజులుగా ఒంగోలు, నెల్లూరు జిల్లాలలో పర్యటించి ఇవాళ తిరుపతి జిల్లాలో పర్యటించామని కమిషన్ సభ్యులు తెలిపారు. రెండు సంవత్సరాలుగా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది మొదటి ఎస్ఎస్ఇ పరీక్షలని.. అందుకే ప్రశాంతంగా నిర్వహించడానికి విద్యా శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు.