ఒడిశాలోని పూరీ ఆలయంలో దారుణం జరిగింది. ఆలయం పై నుంచి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పూరీ జగన్నాథ ఆలయానికి వచ్చిన మహిళ ఆలయం గుమ్మటంపైకి ఎక్కి అక్కడి నుంచి కిందికి దూకేసింది. అంత పై నుంచి దూకడంతో ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆమెను హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. తీవ్రగాయాలతో ఉన్న మహిళను పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు నిర్ధరించారు. ఆత్మహత్యకు పాల్పడిన మహిళ ఎవరు.. ఎందుకు ఆత్మహత్య చేసుకుంది. అందు కోసం పూరీ ఆలయాన్నే ఎందుకు ఎంచుకుందనే వివరాలు ఇంకా తెలియలేదు. సీసీ కెమేరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. పూరీలోని ఆలయ ప్రహరీ గోడ పై నుంచి మహిళ గుమ్మటం ఎక్కినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆమె ఆత్మహత్యపై ఒడిశా పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రసిద్ధ జగన్నాథ ఆలయంలో మహిళ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.