భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ చేసున్న అరాచకాల గుట్టి విప్పారు ఆర్మీ కొత్త చీఫ్ జనరల్ మనోజ్ పాండే. సరిహద్దుల వెంట పాక్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, శిబిరాలు నడపిస్తోందని తెలిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నాతిప్పికొట్టి విజయం సాధించాలని సైన్యం తీర్మానించుకుందని జనరల్ మనోజ్ పాండే తెలిపారు. ఉగ్రవాదం, మాదకద్రవ్యాల మధ్య బంధాన్ని పాకిస్థాన్ ప్రోత్సహిస్తోందని జనరల్ మనోజ్ పాండే ఆరోపించారు. జమ్మూకాశ్మీర్ సహా సరిహద్దు రాష్ట్రాల్లో పాకిస్థాన్ డ్రోన్ల ద్వారా మాదక ద్రవ్యాలు, ఆయుధాలు జారవిడుస్తోందని జనరల్ మనోజ్ పాండే తెలిపారు. పాకిస్థాన్‌తో ఉన్న పశ్చిమ సరిహద్దుల్లో ఇరుదేశాల సైనిక ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్‌ల మధ్య ఏడాది క్రితం కుదిరిన ఒప్పందం క్షేత్ర స్థాయిలో పరిస్థితిని మెరుగుపర్చేందుకు కాస్త దోహదం చేసిందన్న జనరల్ మనోజ్ పాండే.. నియంత్రణ రేఖకు ఇరువైపులా ఉన్న ప్రజలు సురక్షితంగా జీవించేందుకు కూడా మేలు చేసిందన్నారు.