డేంజర్.. ఐఫోన్.. మరింత చౌకగా కావాలా?
ఐఫోన్లతో పాటు మొత్తం 203 సెల్ఫోన్లు ఈ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు మరో 50వేలు క్యాష్ కూడా ఈ ముఠా దగ్గర దొరికింది. అనంతపురం జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి, విజయవాడకు చెందిన రాజేశ్ ఓ దుకాణంలో ఎలాంటి బిల్లులు లేకుండానే ఫోన్లను అమ్ముతున్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసి వారిని అరెస్టు చేశారు. వీరి ఈ ఫోన్లను చెన్నైలోని అబ్దుల్, సుల్తాన్, శీతల్ నుంచి తెప్పించారట. వాళ్లు విదేశాల నుంచి ఐఫోన్లు అక్రమంగా తెప్పిస్తున్నారట. ఏపీలో రాజేశ్, ఆదినారాయణ రెడ్డి వివిధ ప్రాంతాలకు ఈ ఫోన్లు సప్లయ్ చేస్తారట.