వారికి గుడ్న్యూస్.. 3 రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు?
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రూ.685.12 కోట్లు మంజూరు చేసింది. దీనికి సంబంధించి గడిచిన నాలుగు రోజుల్లో ఏపీ రాష్ట్ర నోడల్ ఖాతాకు రూ. 622 కోట్లు విడుదల అయ్యాయి. ఈ మొత్తంలో గడిచిన రెండు రోజుల్లో రూ. 302.96 కోట్లు వేతనదారుల ఖాతాలకు నేరుగా జమ అయ్యాయి. ఇంకా మిగిలిన రూ.319 కోట్లు కూడా రాబోతున్నాయి. అవి వచ్చే రెండు మూడు రోజుల్లో వేతనదారుల ఖాతాలకు నేరుగా జమ కానున్నాయి. ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ మీడియాకు తెలియ జేశారు.