ఆంధ్రా టీఆర్‌ఎస్
పార్టీ ఏంటనుకుంటున్నారా.. టీఆర్‌ఎస్
పార్టీ ఆంధ్రాలోనూ ఉంది. కొణిజేటి ఆదినారాయణ ఆంధ్ర టి ఆర్ యస్
పార్టీ స్థాపించారు. 5 సంవత్సరాలుగా ఆంధ్రలో టి ఆర్ యస్ పార్టీని బలోపేతం చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం
రాజ్యసభ నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా
తెలంగాణ ప్రాంతానికి చెందిన బిసి నేతకి
ఆంధ్రప్రదేశ్ తరఫున
రాజ్యసభ సీటు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఆంధ్రకి చెందిన ఆంధ్ర టి ఆర్ యస్ నేత కొణిజేటి ఆదినారాయణకి
రాజ్యసభ సీటు ఇవ్వాలని ఆంధ్ర టి ఆర్ యస్ నేతలు కోరుతున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావటంలో
కేసీఆర్ కృషి ఎంతో ఉందని.. ఆ రాష్ట్రం అభివృద్ధి పధంలో నడిచేందుకు
కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆంధ్ర టిఆర్యస్
పార్టీ నాయకులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసీఆర్ తరహా పాలన రావాలని వారు కోరుతున్నారు. కానీ పాపం
కేసీఆర్ వారి కోరిక తీర్చనేలేదు.