తిండి కోసం తొక్కిసలాట.. 31 మంది మృతి?

Chakravarthi Kalyan
తిండి కోసం జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 31 మంది చనిపోయిన ఘటన దక్షిణ నైజీరియాలోని పోర్ట్ హార్ కోర్ట్ పట్టణంలో జరిగింది. ఇక్కడ ఓ చర్చ్ నిర్వహించిన డొనేషన్ డ్రైవ్ కార్యక్రమం విషాదాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆహారంతో పాటు మంచి గిఫ్టులు ఇస్తామని నిర్వాహకులు ప్రచారం చేశారు. దీంతో జనాలు భారీగా వచ్చారు. అంచనా కంటే భారీగా ప్రజలు జనం రావడంతో వారిని నిర్వహాకులు కంట్రోల్‌ చేయలేకపోయారు. క్యూలో గంటల తరబడి నిల్చున్న జనం ఓ దశలో అసహనానికి లోనై తోసుకోవడం మొదలెట్టారు. అలా మొదలైన తొక్కిసలాట చివరకు చాలా ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ తొక్కిసలాటలో 31 మంది అక్కడికక్కడే మరణించారు. గాయపడిన ఏడుగురిని హాస్పిటల్ తరలించారు.  విషాదం ఏంటంటే.. అసలు తొక్కిసలాట జరిగే సమయానికి ఇంకా బహుమతుల పంపిణియే ప్రారంభం కాలేదు. సరైన నిర్వహణ లేకుండా ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులపైనా స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: