వణికిస్తున్న మంకీ పాక్స్.. తెలంగాణ అలర్ట్?

Chakravarthi Kalyan
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో మంకీ పాక్స్ కేసులు నమోదవుతున్నాయి. ఇది మరో కరోనా మహమ్మారి తరహాలో విజృంభిస్తుందేమో అన్న ఆందోళన కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఇందుకు తగిన చర్యలు ప్రారంభించింది. మంకీ పాక్స్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించే ప్రక్రియ ప్రారంభించింది. అలాంటి వారిని గుర్తించి వారిని ఐసోలేషన్ లో ఉంచబోతంది.


ఇప్పటికే మంకీ పాక్స్ ప్రబలుతున్న దేశాలకు వెళ్లి వచ్చిన వారిని పరిశీలిస్తారు. అలాంటి వారి ఒంటిపై ఏవైనా దద్దుర్లు ఉంటే  వారి ఆరోగ్యాన్ని గమనిస్తూ ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తన అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అనుమానితులు స్వచ్ఛంధంగా జిల్లా వైద్య అధికారులను సంప్రదించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ  సూచిస్తోంది. అనుమానితుల రక్త నమూనాలను తీసుకుని పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపనున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: